News November 10, 2024
కురుమూర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో కురుమూర్తి ఆలయానికి సీఎం చేరుకున్నారు. ఆలయానికి సంబంధించి రూ.110 కోట్లతో ఆలయ ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెట్ల మార్గంలోనే కురుమూర్తి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News December 7, 2024
MBNR: గ్రూప్ -4 సాధించిన కానిస్టేబుళ్లు.. అభినందించిన జిల్లా ఎస్పీ
మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల విధులలో చేరిన 117మంది నూతన కానిస్టేబుల్స్ అభ్యర్థులలో 12 మంది అబ్బాయిలు, ఓ అమ్మాయి మొత్తం 13మంది గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారిని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అభినందించారు. వీరంతా భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.
News December 7, 2024
MBNR: ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్
ఆందోల్ MLA రాజనర్సింహ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆయనకు CM రేవంత్ వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించడంతో పాటు MBNR ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా MBNRలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రుణమాఫీ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తిచేస్తున్నామన్నారు. మీ కామెంట్?
News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. పాలమూరు REPORT
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి MBNRలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, కొడంగల్‌లో ‘కడా’ ఏర్పాటు, కురుమూర్తి ఆలయ ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి రూ.110కోట్లతో శంకుస్థాపన, జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటన, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?