News March 19, 2025
కురుమూర్తిలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు: భట్టి

ఉమ్మడి MBNR జిల్లాలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవాలయం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్లో విడుదల చేసిన రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలైనట్లు చెప్పారు.
Similar News
News March 20, 2025
మెదక్: 24న సీజ్ చేసిన బియ్యం వేలం

పౌర సరఫరాల శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యాన్ని వేలం నిర్వహిస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి పేర్కొన్నారు. 6a కేసు కింద సీజ్ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని వేలం ఈనెల 24న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేవారు 22 సాయంత్రం 5 గంటలలో లోపు రూ.2500 డిపాజిట్ చేయాలని సూచించారు. అత్యధిక వేలం దారులకు బియ్యాన్ని అమ్మనున్నట్లు చెప్పారు.
News March 20, 2025
జుక్కల్: అనుమానస్పదంగా వ్యక్తి మృతి

జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో మున్నూరు కాపు బిచ్కుంద భూమయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్థులు చెప్పారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. తండ్రి భూమయ్య కొడుకుతో కొద్దిపాటి వాగ్వివాదం జరిగిన అనంతరం ఉరేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ అది ఆత్మహత్యగా కనిపించడం లేదంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2025
ధర్మపురి: రథోత్సవంలో జేబుదొంగ

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవంలో ఓ జేబుదొంగ పోలీసులకు చిక్కాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కొనసాగింది. రథాల వద్ద ఉన్న ఓ భక్తుని జేబులో చేయి పెడుతుండగా అక్కడే ఉన్న గొల్లపల్లి ఎస్ఐ సతీష్ గమనించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వెంటనే సదరు వ్యక్తి జేబును వెతకగా జేబులో నుంచి దాదాపు నాలుగైదు పర్సులు, కొంత నగదు లభించాయి. వెంటనే జేబుదొంగను స్టేషన్ కు తరలించారు.