News March 19, 2025
కురుమూర్తిలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు: భట్టి

ఉమ్మడి MBNR జిల్లాలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవాలయం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో విడుదల చేసిన రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలైనట్లు చెప్పారు.
Similar News
News April 20, 2025
ADB ITI కళాశాలలో రేపు అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ అందజేస్తామన్నారు.
News April 20, 2025
మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

మోత్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. అనాజిపురం-దాచారం గ్రామాల మధ్య ఉన్న పత్తి మిల్లు వద్ద బైక్ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంపటికి చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
HYD: రెసోనెన్స్ విద్యార్థుల జయకేతనం

JEE మెయిన్స్-2025 ఫలితాలలో రెసోనెన్స్ విద్యార్థులు సత్తా చాటారు. మెయిన్స్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. అర్చిస్మాన్ అనే స్టూడెంట్ 295 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం సన్మానించింది.