News February 16, 2025
కులగణంలో పాల్గొనని వారికి మరోసారి సర్వే: కలెక్టర్

తెలంగాణలో తొలిసారి చేపట్టిన కులగణన సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో ఎవరైతే వివిధ కారణాలచే నమోదు చేసుకోలేదో అటువంటి వారి కోసం మరోసారి సర్వే నిర్వహణ ఉంటుందని కలెక్టర్ హనుమంత రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వేను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 040-211111111 సంప్రదించవచ్చన్నారు.
Similar News
News December 9, 2025
ఎన్యూమరేటర్లకు బెదిరింపులు.. ECIకు సుప్రీం నోటీసులు

SIR చేపట్టిన BLOలకు భద్రత కల్పించాలని దాఖలైన పిటిషన్లపై తమ వైఖరి తెలపాలని ECI, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. డోర్-టు-డోర్ సర్వేకు వెళ్లిన వారిని ముఖ్యంగా బెంగాల్లో అడ్డుకుంటున్నారని, బెదిరిస్తున్నారని వేసిన రెండు పిటిషన్లను CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ బెంచ్ నేడు విచారించింది. పరిస్థితిని అదుపులోకి తేవాలని లేదంటే దారుణాలు జరుగుతాయని ECని CJI ఆదేశించారు.
News December 9, 2025
అన్నవరం ఈవో బదిలీ

అన్నవరం దేవస్థానంలో వరుస ఘటనలపై Way2Newsలో వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రభుత్వం ఈవో సుబ్బారావుపై వేటు వేసింది. ఆయనను మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి పంపింది. కొత్త ఈవోగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ త్రినాధరావును నియమించింది. సుబ్బారావు సర్వీస్ వెనక్కి తీసుకోవడంతో ఆయనపై జరిగిన విచారణ నివేదికపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
News December 9, 2025
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. కనగల్ ఎంపీడీవో ఆఫీస్, సాయిరాం ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రి సిద్ధం చేయాలని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు ప్రాపర్గా చెక్ చేయాలని సూచించారు.


