News December 27, 2024

కుల‌గ‌ణ‌న‌పై స‌చివాల‌యాల ప‌రిధిలో సామాజిక స‌ర్వే: విశాఖ జేసీ

image

జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాల‌పై సమీక్ష చేసేందుకు, ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వ‌హించిన కులగ‌ణ‌న‌పై గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో సామాజిక స‌ర్వే(సోష‌ల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 28, 2024

విశాఖ: బీచ్‌లో ప్రారంభమైన నేవీ రిహార్సల్స్

image

విశాఖ నగరంలో వచ్చే నెల నాలుగవ తేదీన నేవీ డే సందర్భాన్ని పురస్కరించుకుని బీచ్‌లో శనివారం సాయంత్రం నేవీ రిహార్సల్స్ ప్రారంభం అయ్యాయి. నేవీ అధికారులు, సిబ్బంది అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు. ఒకేసారి మూడు హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నగరంలో ప్రజలు విన్యాసాలను తిలకించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు రిహార్సల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

News December 28, 2024

విశాఖ: ‘మరింత సమర్థవంతంగా పనిచేయాలి’

image

పోలీస్ అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు వెళ్లాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. వుడా చిల్డ్రన్ ఎరీనాలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిధర్, నేవీ అధికారులతో కలిసి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. గిరిధర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

News December 28, 2024

విశాఖ: ఈనెల 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,59,277 మంది లబ్ధిదారులకు రూ.69.21 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు.