News December 27, 2024
కులగణనపై సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే: విశాఖ జేసీ
జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాలపై సమీక్ష చేసేందుకు, పథకాలు అమలు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వహించిన కులగణనపై గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే(సోషల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.
Similar News
News January 24, 2025
కొత్తపల్లి జలపాతం నాలుగు రోజులు మూసివేత
జీ.మాడుగుల మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24 నుంచి 27 వరకు మూసివేస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. జనవరి 24వ తేదీ నుంచి 27 వరకు జలపాతం ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఎవరికి ప్రవేశం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు కొత్తపల్లి జలపాతం సందర్శించవద్దని అభిషేక్ పేర్కొన్నారు.
News January 23, 2025
విశాఖ-దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదింపు
విశాఖ-దుర్గ్ వందేభారత్ (20829/30) ఎక్స్‌ప్రెస్‌కు కోచ్‌లు కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రైలు 16 కోచ్‌లతో నడిచేది. అయితే జనవరి 24వ తేదీ నుంచి 8 కోచ్‌లతో మాత్రమే నడుస్తుందని ఆయన తెలిపారు. అందులో ఒక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్, ఏడు ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News January 23, 2025
విశాఖ: పుట్టినరోజు నాడే కానిస్టేబుల్ అభ్యర్థి మృతి
విశాఖ ఏఆర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో గురువారం ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది.1,600 మీటర్ల రన్నింగ్ అనంతరం సొమ్మసిల్లి పడిపోయిన శ్రవణ్ కుమార్‌ను నిర్వాహక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పుట్టినరోజు నాడే శ్రవణ్ కుమార్ మృతి చెందటం పట్ల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీస్ అవుతాడానుకుంటే అందరాని దూరాలకు వెళ్లిపోయాడని విలపిస్తున్నారు.