News February 28, 2025

కులగణన సర్వేకు నేడు చివరి అవకాశం: మంత్రి పొన్నం

image

కులగణన సర్వే నేటితో ముగియనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమరేటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే ఇవ్వాలన్నారు. కుల కులగణన సర్వేకు వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుంచి వరకు అవకాశం ఇవ్వగా నేటితో గడువు ముగుస్తుందన్నారు. సర్వేలో పాల్గొనని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

Similar News

News November 17, 2025

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.

News November 17, 2025

లింగంపేట: భర్తకు దాహన సంస్కారాలు చేసిన భార్య

image

భర్త గుండె పోటుతో మృతి చెందడంతో భార్య దహన సంస్కారాలు నిర్వహించారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన బాలయ్య ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు కొడుకు గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలయ్య భార్య సత్యవ్వ దహన సంస్కారాలు నిర్వహించింది. గ్రామంలో అంతిమయాత్రను చూసిన గ్రామస్థులు కంటతడి పెట్టారు.

News November 17, 2025

నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు.. రాజమౌళి పాత ట్వీట్ వైరల్

image

తనకు దేవుడంటే నమ్మకం లేదంటూ <<18300800>>రాజమౌళి<<>> చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్న వేళ ఆయన పాత ట్వీట్ వైరల్ అవుతోంది. 2011లో ఓ అభిమాని జక్కన్నకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. ‘థాంక్యూ. కానీ నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. అన్ని అవతారాల్లో కృష్ణుడు నా ఫేవరెట్’ అని రిప్లై ఇచ్చారు. మరి రాముడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారు? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.