News November 10, 2024

కులగణన సర్వేలో తప్పులు దొర్లితే సిబ్బందిపై చర్యలు: కలెక్టర్ 

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కుటుంబాలకు అనుగుణంగా ఎన్యుమరేటర్‌లను నియమించమన్నారు. సర్వే ఫారంలో ఉన్న 75 ఖాళీలను పూర్తిగా నింపి కులగణన సమగ్రంగా ఉండేలా ఎన్యుమరేటర్‌లు చూడాలన్నారు.

Similar News

News December 11, 2024

ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలి: మంత్రి పొంగులేటి 

image

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు.

News December 11, 2024

వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: పొంగులేటి

image

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి బుధవారం వరంగల్ అభివృద్ధిపై మాట్లాడారు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

News December 11, 2024

గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లాలో గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రూప్-2 పరీక్ష నిర్వహణ, బయోమెట్రిక్ విధానంపై కలెక్టర్ అవగాహన సదస్సును నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షకు జిల్లాలో 16 కేంద్రాల్లో 5471 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.