News March 3, 2025
కుల్కచర్ల: వేలాడుతున్న కరెంట్ వైర్లకు కర్రలే స్తంభాలు !

కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో రైతుల పొలాల్లో విద్యుత్ తీగలు చేతులకు తాకేలా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. గ్రామంలో ప్రజలే పొలాల్లో తాత్కాలికంగా కర్రలను విద్యుత్ స్తంభాలుగా మార్చుకొని వ్యవసాయ పనులు చేసుకుంటున్న దుస్థితి నెలకొందని ముదిరాజ్ సంఘం యువ నాయకులు చిల్ల చంద్రశేఖర్, చిల్ల గోపాల్ అన్నారు. దీంతో అధికారులు స్పందించి ఏదైనా ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News October 31, 2025
అమలాపురం: విద్యార్థులకు అరుదైన అవకాశం

‘స్పేస్ వీక్ సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషన్ టు ఢిల్లీ’ కార్యక్రమానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికయ్యారని డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా విద్యార్థినులు ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం అభినందనీయమన్నారు. పైడి కొండల రాజేశ్వరి, రాచకొండ సృజన, జ్ఞానపూర్ణ దేవి దీక్షిత, ఎంహెచ్ఎస్ వి అనూష ఎంపికైన వారిలో ఉన్నారని డీఈవో వెల్లడించారు.
News October 31, 2025
వరల్డ్ కప్‌లో అదరగొట్టిన కడప అమ్మాయి

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో కడప జిల్లా అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి ఆదరగొడుతోంది. ఎర్రగుంట్ల RTPPకి చెందిన ఆమె వరల్డ్ కప్‌లో మొదటి నుంచి రాణిస్తున్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో 2 వికెట్లు తీశారు. అయితే 10 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇండియా ఫైనల్‌కి చేరడంలో తనవంతు పాత్ర పోషించడంతో శ్రీచరణిని పలువురు అభినందిస్తున్నారు.
News October 31, 2025
Rewind: నిజాం నవాబుకు.. పటేల్ జవాబు

1947లో దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుతుంటే.. HYD సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో నలుగుతోంది. రజాకారుల దౌర్జన్యాలు, అరాచకాలతో జనాలు తల్లడిల్లుతున్నారు. సంస్థానాన్ని PAKలో కలపాలని ఖాసీంరజ్వీ కుట్ర పన్నాడు. ఇది చూసి పటేల్ హృదయం రగిలింది. నిజాం బంధనాల నుంచి విడిపించాలని సంకల్పించారు. భారత బలగాలను నగరానికి పంపారు. కేవలం 108 గంటల్లో అసఫ్‌జాహీ పాలనకు తెరదించారు.
*నేడు సర్దార్ పటేల్ జయంతి. సలాం సర్దార్.


