News October 29, 2024
కుల గణనలో తెలంగాణ ఒక మోడల్: భట్టి
ఖమ్మం: రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయ వాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సందేశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కుల గణన చేస్తామని హామీ ఇచ్చామని ఇప్పుడు హామీని అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News November 4, 2024
రేపటి బిసి కమీషన్ బహిరంగ విచారణ వాయిదా: కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ బిసి కమీషన్ నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల బహిరంగ విచారణ అనివార్య పరిస్థితుల కారణంగా ప్రభుత్వం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News November 4, 2024
వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల
పాలన, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం కాసేపు గడిపారు. పచ్చని పంట పొల్లాల్లో కలియ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. ఆయిల్ పామ్ సాగులో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ పద్ధతుల గురించి కూలీలతో చర్చించారు.
News November 4, 2024
రెండు రోజుల్లో ఇంద్రిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం: పొంగులేటి
మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ మొదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. గత BRS ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వాళ్లకే స్కీములు ఇచ్చారని అన్నారు. అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.