News April 11, 2025
కుల వృత్తిదారులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు కుల వృత్తిదారుల ఇళ్లకు వెళ్లారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకుని వారికి ప్రోత్సాహకాలు అందించారు. జగన్నాథం అనే వ్యక్తికి చెందిన బార్బన్ షాపుని పరిశీలించి ఆయనతో మాట్లాడారు. బార్బన్ కిట్‌ను అందజేశారు. అనంతరం ఆగిరిపల్లి మార్కెట్ యార్డులో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.
Similar News
News April 21, 2025
వాకింగ్ ఎంత వేగంతో చేస్తున్నారు?

ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఎంతవేగంతో ఎంతసేపు నడుస్తున్నామనేది చాలా ముఖ్యం. గంటకు 6.4 కి.మీ వేగంతో నడిస్తే గుండె దడ, హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గుల సమస్యలు 43 శాతం తగ్గుతాయని గ్లాస్గో వర్సిటీ(UK) అధ్యయనం వెల్లడించింది. 4.20 లక్షల మంది వాకర్స్ నుంచి 13 ఏళ్లపాటు డేటాను సేకరించి ఈ వివరాలను తెలిపింది. వేగంగా నడిస్తే బరువు, రక్తంలో కొవ్వు, జీర్ణ సమస్యలు తగ్గుతాయని పేర్కొంది.
News April 21, 2025
శ్రీకాళహస్తి: జైన సన్యాసినిగా మారనున్న 17 ఏళ్ల యువతి

శ్రీ కాళహస్తికి చెందిన జైన్ సునీల్ జైన్ ప్రథమ కుమార్తె కాషిష్ జైన్ 17 సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. స్థానిక కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అభినందన సభలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెను సత్కరించారు. వచ్చే నెల 3న నాశిక్‌లో తమ గురువులు మహాసతి, ప్రమోద్ ముని మారా సాహెబ్ ద్వారా ఆమె సన్యాసిగా మారనున్నట్లు తెలిపారు.
News April 21, 2025
కడప: తాగిన మైకంలో గొంతు కోసుకున్న యువకుడు

కడపలో ఇమ్రాన్ మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇమ్రాన్‌కు తన భార్యతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అతను బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.