News April 10, 2025
కువైట్లో కాకినాడ జిల్లా మహిళపై యాసిడ్ దాడి

భర్త మృతితో కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన మహిళ యాసిడ్ దాడికి గురై అక్కడ చిక్కుకుపోయింది. యూ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త చనిపోవడంతో కువైట్లో పనికి వెళ్లింది. కడపకు చెందిన ఓ ఏజెంట్ ఆమెను 2నెలల క్రితం పంపించాడు.150 దీనార్ల జీతమని చెప్పి 100 దీనార్లే ఇవ్వడంతో ఆమె ప్రశ్నించింది. దీంతో యాసిడ్తో దాడి చేశాడు. ఈ విషయం ఆమె కుటుంబీకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 29, 2025
చిట్యాల: గ్రేట్ సర్పంచ్.. 26 ఏళ్లపాటు సేవలు..!

26 ఏళ్లపాటు గ్రామస్థాయి ప్రజాప్రతినిధిగా సేవలందించారు చిట్యాల(M) గుండ్రాంపల్లికి చెందిన ఏసిరెడ్డి బుచ్చిరెడ్డి. సర్పంచ్గా 16ఏళ్లు, వార్డు మెంబర్గా 11ఏళ్లు ప్రాతినిధ్యం వహించారు. 1970-1981వరకు వార్డు సభ్యుడిగా, 1981-1996 వరకు సర్పంచ్గా చేశారు. ఆయన హయాంలో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని, ప్రస్తుతం 85 ఏళ్ల వయసులోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారని గ్రామస్థులు కొనియాడారు.
News November 29, 2025
పాలమూరులో 550 పంచాయతీలకు నేడే కీలక గడువు

ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లోని తొలి విడతలో 550 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. నిన్న (శుక్రవారం) అష్టమి కావడంతో నామినేషన్లు తక్కువగా దాఖలయ్యాయి. నేటి సా.5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఉంది. DEC 11న ఉ.7 నుంచి మ.1 గంట వరకు పోలింగ్ జరుగగా, మ.2 గంటల నుంచి ఫలితాలు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.
News November 29, 2025
వరంగల్: వీసీ సరే, మరీ వీరి సంగతేందీ?

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ VC నందకుమార్ రెడ్డి రాజీనామాతో అక్రమాలకు బ్రేకులు పడేలా లేవు. అక్రమార్కులకు పునరావాస కేంద్రంగా మారిన యూనివర్సిటీని ప్రక్షాళన చేయాల్సిందేనని CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. యూనివర్సిటీకి రూ.700 కోట్లకు పైగా నిధులుండటంతో అక్రమార్కులు ఆదాయ వనురుగా మార్చుకున్నారని ఇంటెలిజెన్సు సైతం నివేదికను అందించారు. డిప్యూటేషన్లపై వచ్చిన వారికి ఉద్వాసన పలకాలని నిర్ణయించారట.


