News April 10, 2025

కువైట్‌లో కాకినాడ జిల్లా మహిళపై యాసిడ్ దాడి

image

భర్త మృతితో కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన మహిళ యాసిడ్ దాడికి గురై అక్కడ చిక్కుకుపోయింది. యూ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త చనిపోవడంతో కువైట్‌లో పనికి వెళ్లింది. కడపకు చెందిన ఓ ఏజెంట్ ఆమెను 2నెలల క్రితం పంపించాడు.150 దీనార్ల జీతమని చెప్పి 100 దీనార్లే ఇవ్వడంతో ఆమె ప్రశ్నించింది. దీంతో యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ విషయం ఆమె కుటుంబీకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News January 14, 2026

జిల్లాల పునర్విభజనపై మెతుకు సీమలో ఆశలు

image

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.

News January 14, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత తగ్గుతూ వస్తోంది. బుధవారం ఉదయం వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 13.2℃, జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం 13.3℃, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం 14.3℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 14.5℃గా నమోదయ్యాయి.

News January 14, 2026

HYD: నూతన సర్పంచ్‌లకు గుడ్ న్యూస్

image

కేంద్ర ప్రభుత్వం నూతన సర్పంచ్‌లకు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘానికి చెందిన గ్రామపంచాయతీల పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.2,500 కోట్ల నిధుల్లో ఈ నెలాఖరులోపు కనీసం రూ.1,000 కోట్లు విడుదల చేయనుండగా, మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం. నిధుల వినియోగంపై మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ చర్యలు ప్రారంభించింది.