News January 29, 2025

కుష్టు వ్యాధిగ్రస్తులు సంఖ్య తగ్గుతుంది: DMHO

image

గుంటూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్స్ (LCDC)ని తమిళనాడుకు చెందిన LCDC మానిటరింగ్ టీమ్ అధికారులు రంగనాథ్, అక్షర్ పురోహిత్ మంగళవారం పరిశీలించారు. ఈమని ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో సభ్యులు ఈ సందర్భంగా పరిశీలన చేశారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి విజయలక్ష్మీ తన ఛాంబర్‌లో కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులు సంఖ్య తగ్గుతుందన్నారు.

Similar News

News February 10, 2025

కాకుమానులో ప్రమాదాలు.. ఇద్దరి మృతి

image

కాకుమాను మండలంలో సోమవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైకుపై ఉన్న వ్యక్తి ఘటన స్థలంలో మృతి చెందాడు. మండలంలోని కొండపాటూరు గ్రామంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు క్రాంతి కుమార్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 10, 2025

తాడేపల్లి: జగన్ ఇంటి వద్ద కెమెరాలు 

image

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ నుంచి మానిటర్ చేయనున్నారు.

News February 10, 2025

గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో 0863-2241029 తో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుందని అన్నారు. ఎన్నికల పై ఫిర్యాదు చేయడంతో పాటూ ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!