News January 30, 2025
కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: బాపట్ల కలెక్టర్

జిల్లాలో స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి చెప్పారు. గురువారం బాపట్లలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ అండ్ పాంప్లెట్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన జిల్లాలో ఈ కార్యక్రమం 15 రోజులపాటు నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
Similar News
News October 28, 2025
కుప్పకూలిన విమానం.. 12 మంది సజీవదహనం

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లైట్ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయి మంటలు వ్యాపించడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. ఇవాళ ఉదయం టూరిస్టులతో డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తుండగా సింబా గోలిని ఏరియాలో కుప్పకూలినట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. పోలీసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
News October 28, 2025
మొంథా తుఫాన్ హెచ్చరికలు ఆందోళనలో రైతాంగం

మొంథా తుఫాన్ ప్రభావ హెచ్చరికలతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతు కావలసిన ఏర్పాట్లను తక్షణమే చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. 1,32,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేయగా ఇప్పటికే 35% వరకు వరి కోతలు పూర్తికావస్తున్నాయి.
News October 28, 2025
KMM: వామ్మో.. 5 కోట్ల సంవత్సరాల దారుశిలాజం హా?

మధిర రైల్వే స్టేషన్ రామాలయం పునర్నిర్మాణ పనుల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో లభించిన ఓ పురాతన రాయిని పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. అది సుమారు 5 కోట్ల సంవత్సరాల వయసు గల దారుశిలాజంగా గుర్తించారు. విస్తృత పరిశోధన కోసం శిలను HYD ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. ఇంతటి చరిత్ర కలిగిన రాయి దొరకడంపై ఆలయ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.


