News February 8, 2025

కూకట్‌పల్లిలో తూ.గో జిల్లా వివాహిత SUICIDE

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని సుమిత్రానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీశెట్టి కనక రత్నమ్మ (46) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Similar News

News November 6, 2025

వికారాబాద్‌లో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

image

వికారాబాద్ పరిధి శివారెడ్డిపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఈరోజు 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను డీసీఓ సాయిలత ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఆమె అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, డాక్టర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

News November 6, 2025

వికారాబాద్: రాజీమార్గం అన్ని విధాలుగా మేలు: జడ్జి

image

రాజీమార్గంతో లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో నవంబర్ 15న నిర్వహించనున్న లోక్ అదాలత్‌పై పోలీసులు, న్యాయవాదులతో జడ్జి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు నచ్చజెప్పి భారీగా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

News November 6, 2025

గిగ్ వర్కర్ల సంక్షేమానికి TG ప్రత్యేక చట్టం

image

TG: రాష్ట్ర గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్-2025ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ బిల్లును త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆమోదించి ప్రత్యేక చట్టం చేయనున్నారు. ఈ చట్టం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అందిస్తుంది. ప్రధానంగా ఆదాయ భద్రత, కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు, గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.