News March 25, 2024

కూకట్‌పల్లిలో యువతిపై అత్యాచారం

image

ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన KPHBలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సంబంధించి KPHBలో ఆన్‌లైన్‌ శిక్షణకు చేరింది. ఈక్రమంలో ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు నరేందర్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం శిక్షణ సహచరుడు సంతోష్‌కు తెలపగా అతడు కూడా ఆమెను వేధించాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. నరేందర్, సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News November 7, 2024

HYD: లక్షల్లో భవనాలు.. పదుల్లో ఫైర్ స్టేషన్లు..!

image

గ్రేటర్ HYDలో లక్షకు పైగా ఐదంతస్తుల కంటే ఎత్తు కలిగిన భవనాలు ఉన్నాయి. HYD, RR, MDCL జిల్లాల్లో చూస్తే అగ్నిమాపక కేంద్రాలు కేవలం 31 మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా సరైన సమయానికి అగ్నిప్రమాదం జరిగిన చోటుకు వెళ్లలేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాల స్థాయి పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News November 7, 2024

HYD: డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు: మంత్రి

image

డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. HYDలో నిర్వహించిన సమావేశంలో అధికారులతో ఆమె చర్చించారు. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళను చేర్పించడమే లక్ష్యంగా ప్రోగ్రాం నిర్వహిస్తామని,పంచాయతీరాజ్, నిర్వహిస్తామని, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల సంస్థలు ఇందులో భాగమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

News November 7, 2024

HYD: డెడ్‌బాడీకి చికిత్స.. మెడికవర్ వైద్యుల క్లారిటీ

image

మాదాపూర్ మెడికవర్‌లో చికిత్స పొందుతూ మరణించిన జూ. డాక్టర్ నాగ ప్రియ (28) మృతిపై ఆస్పత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. ఠాగూర్ సినిమాను తలపించేలా ఆస్పత్రిలో డెడ్ బాడీకి చికిత్స, బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారంటూ వచ్చిన కథనాలను మెడికవర్ వైద్యులు, యాజమాన్యం ఖండించారు. అడ్మిట్‌కు ముందే పేషెంట్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, బతికించేందుకు తీవ్రంగా కృషి చేశామన్నారు.