News February 5, 2025
కూకట్‌పల్లిలో 8 మంది మహిళల బైండోవర్

కూకట్‌పల్లి PS పరిధిలోని భాగ్యనగర్ కాలనీ అల్లూరి ట్రేడ్ సెంటర్ వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది మహిళలను కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం అందడంతో వీరిని అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News April 19, 2026
సూర్యాపేటలో 163 BNSS అమలు: ఎస్పీ నరసింహ

సూర్యాపేట జిల్లాలో రేపటి నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ తరహాలో ఆంక్షలు ఉంటాయని, గుంపులుగా చేరడం నిషేధమని స్పష్టం చేశారు. పరీక్ష సమయాల్లో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
News April 19, 2026
లైసెన్స్ సర్వేయర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: జేసీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 235 మంది లైసెన్స్ సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ నియామక ప్రక్రియను జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.