News June 17, 2024

కూకట్‌పల్లి: జేఎన్టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు

image

JNTUలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డా.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్, ఇంజినీరింగ్ కాలేజీలకు సర్కులర్ జారీ చేశారు. సాంబారులో పురుగులు ఉన్నాయంటూ మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు ధర్నా చేయడం, వర్సిటీ పాలనాపరమైన కొందరి పదోన్నతులపై ధర్నా నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Similar News

News November 24, 2025

అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి CP సజ్జనార్

image

హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. లంగ‌ర్‌హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్‌కాలనీల్లోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ హెచ్చరించారు.

News November 24, 2025

HYD: కారు ప్రమాదంలో సజీవదహనమైన దుర్గాప్రసాద్

image

శామీర్‌పేట్ ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్‌లోని ORR వైపు మళ్లించాడని, శామీర్‌పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రించాడేమోనని? అనుమానిస్తున్నారు.

News November 24, 2025

హైదరాబాద్ మెట్రో రైల్.. పర్మిషన్ ప్లీజ్

image

నగరంలో రోజూ లక్షలాదిమందిని మెట్రో ట్రైన్ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ సేవలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశను ప్రతిపాదిస్తూ DPR( డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను కేంద్రానికి పంపింది. గత సంవత్సరం నవంబర్లో ఒకటి, ఈ సంవత్సరం జూన్లో మరో ప్రతిపాదన అందజేసింది. 163 కిలోమీటర్ల వరకు మెట్రోను విస్తరిస్తామని  పేర్కొంది. అయితే ఇంతవరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.