News February 6, 2025

కూకట్‌పల్లి-నిజాంపేటలో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ

image

కూక‌ట్‌ప‌ల్లి-నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుప‌త్రి వెనుక ప్ర‌భుత్వ స్థ‌లం చుట్టూ నిర్మించిన ప్ర‌హ‌రీని బుధ‌వారం హైడ్రా తొల‌గించింది. ‘300ల గ‌జాల ఇంటి స్థ‌లం క‌బ్జాకు గురైంద‌ని ఓ మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. విచార‌ణ చేయగా దాదాపు 1253 గ‌జాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురైన‌ట్లు తేలింది. దీంతో క‌బ్జా చేసిన స్థ‌లం చుట్టూ నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా తొల‌గించింది’ అని అధికారులు స్పష్టం చేశారు.

Similar News

News December 1, 2025

జగిత్యాల: 3,536 పోలింగ్ స్టేషన్లకు 110 మైక్రో అబ్జర్వర్లు

image

జగిత్యాల జిల్లా కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారి పాత్ర కీలకమని, చెక్‌లిస్ట్ ఆధారంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 3,536 స్టేషన్లకు 110 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించినట్టు తెలిపారు. సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

News December 1, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

image

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, భద్రత, సభాస్థలి, రవాణా నిర్వహణ వంటి అంశాలను అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.

News December 1, 2025

సంస్కరణల ప్రభావం.. నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

image

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్‌లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్‌లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.