News February 18, 2025
కూకట్పల్లి: సంప్రదాయబద్ధంగా శునకానికి అంత్యక్రియలు

మూసాపేట్ ఆంజనేయ నగర్కు చెందిన సోమా ప్రభాకర్ 14 ఏళ్ల క్రితం తనకు దొరికిన కుక్క పిల్లను చేరదీసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తనకు ఆడపిల్లలు లేకపోవడంతో ఆ శునకానికి కుట్టి అని పేరు పెట్టి కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో కుక్కపిల్ల సోమవారం మృతి చెందింది. దీంతో వారు శోకసంద్రంలో మునిగారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.
Similar News
News September 18, 2025
నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసిన రుడా ఛైర్మన్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుడా పరిధిలోని అంశాలను, పలు సమస్యలను ఆమెకు వివరించారు. రుడా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
News September 18, 2025
టెక్కలి: గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి

టెక్కలి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు గురువారం పరిశీలించారు. స్థానిక అధికారిణి రూపావతితో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు వస్తే గ్రంథాలయాల అభివృద్ధికి దోహద పడతాయన్నారు. అనంతరం పాఠకులతో మాట్లాడారు.
News September 18, 2025
భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, పరిశ్రమలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.