News November 10, 2024

కూచిపూడి థీమ్‌తో టెర్మినల్ డిజైన్లు ఉండాలి: చంద్రబాబు

image

కూచిపూడి నాట్యానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గన్నవరంలో విమానాశ్రయ టెర్మినల్ డిజైన్లు కూచిపూడి థీమ్‌తో నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. శనివారం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ఆయన తన నివాసంలో సమీక్షించారు. ఈ సమీక్షలో టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ల నిర్మాణంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు. 

Similar News

News November 14, 2024

విజయవాడ: నెహ్రూకి నివాళులర్పించిన వైఎస్ షర్మిల

image

భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి విశేష సేవలు అందించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశం కోసం నిస్వార్ధంగా సేవలు అందించిన ఏకైక కుటుంబం గాంధీ కుటుంబం అని అన్నారు.

News November 14, 2024

హైవేపై టైర్ పంక్చర్.. పల్టీ కొట్టిన బొలెరో వాహనం

image

కంచికచర్ల మండల పరిధిలోని కీసర జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి నందిగామ వైపు వెళుతున్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. బొలెరో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, అతణ్ని ప్రభుత్వ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. బండిలోని సరుకు రోడ్డుపై పడటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

News November 14, 2024

కృష్ణా: విద్యార్థులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్‌లో 90 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ను రూపొందించామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.