News April 24, 2024

కూటమికి ప్రజలు మద్దతు తెలపాలి: పురంధీశ్వరి

image

కూటమికి ప్రజలు మద్దతు తెలపాలని రాజమండ్రి లోక్‌సభ కూటమి ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధీశ్వరి అన్నారు. సోమవారం నిడదవోలులో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ MLAగా కూటమి అభ్యర్థి కందుల దుర్గేశ్‌ను, ఎంపీగా తనను గెలిపించాలని అభ్యర్థించారు.

Similar News

News January 22, 2026

ప.గో: ‘అమరజీవి జలధార’కు రూ.1,400 కోట్లు

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్‌, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 21, 2026

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: జడ్జి సుధారాణి

image

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.