News May 19, 2024
కూటమికి 160పైగా సీట్లు: కిమిడి
YCP ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయమని చీపురుపల్లి TDP MLA అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమన్న ఆయన..1983,1994ఎన్నికల తరహాలో ఈసారి పెద్దఎత్తున ప్రభంజనం వచ్చిందన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు, ప్రకృతిని దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా YCP పాలించిందని ఆరోపించారు. జూన్ 9న విశాఖలో CMగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తామని బొత్స చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Similar News
News December 13, 2024
భోగాపురం: చిట్టీల కేసులో భార్య, భర్త అరెస్ట్
చీటీలు, స్కీములు నిర్వహించి సుమారు రూ.2 కోట్లు వరకు మోసం చేసిన భీమిలి మండలం వలందపేటకు చెందిన భార్యాభర్తలు సరగడపార్వతీ, లక్ష్మణరెడ్డిలను అరెస్టు చేసినట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో చీటీలు, రకరకాల స్కీములు నిర్వహించి గ్రామస్థుల నుంచి సుమారు రూ.2 కోట్లు చీటింగ్ చేసినట్లు ఆ గ్రామానికి చెందిన మజ్జి త్రినాథమ్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
News December 13, 2024
మక్కువ: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మక్కువ మండలంలోని శంబర రహదారి సమీపంలో ఇటుక బట్టి వద్ద పని చేస్తున్న అంజిబాబు విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. యానాదుల వీధికి చెందిన అంజిబాబు గత కొన్ని ఏళ్లుగా ఇటుక బట్టి వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఐరన్ పైపులను తాకడంతో వెంటనే షాక్ గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News December 11, 2024
గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.