News March 30, 2024
కూటమితో బీసీలకు బంగారు భవిష్యత్తు: కోండ్రు

సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని టీడీపీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. వంగర మండలం అరసాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీల కోసం రూ.36వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీలకు వైసీపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు.
Similar News
News October 24, 2025
ఇళ్ల కోసం అర్హులను గుర్తించండి: మంత్రి ఆదేశాలు

నవంబర్ 5లోగా ఆన్లైన్లో ఇళ్ల కోసం కోసం దరఖాస్తు చేసుకొని విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సూచించారు. అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు.
News October 24, 2025
ఎచ్చెర్ల: వర్సిటీలో క్యాంటీన్ నిర్వహణకు దరఖాస్తు గడువు పెంపు

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో క్యాంటీన్ నిర్వహణకు గడువు తేదీ పెంచినట్లు యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య బి.అడ్డయ్య పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీలోగా https://www.brau.edu.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారం సబ్మిట్ చేయాలని ఆయన కోరారు. గతంలో ప్రకటించిన తేదీకి దరఖాస్తులు రాకపోవడంతో గడువు పెంచినట్లు ఆయన తెలియజేశారు. పూర్తి వివరాలకు98662 99401 ఫోన్ నెంబర్కు సంప్రదించాలన్నారు.
News October 24, 2025
B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.30/-లు, పరీక్షల ఫీజు రూ.1305/-లతో కలిపి మొత్తం రూ.1335/-లను నవంబర్ 10వ తేదీ లోపు చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ సూచించారు. హాల్ టికెట్లు నవంబర్ 15న, పరీక్షలు 25వ తేదీన జరుగుతాయన్నారు.


