News March 30, 2024

కూటమితో బీసీలకు బంగారు భవిష్యత్తు: కోండ్రు

image

సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని టీడీపీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. వంగర మండలం అరసాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీల కోసం రూ.36వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీలకు వైసీపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు.

Similar News

News March 16, 2026

శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షకు 105 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 105 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. జిల్లాలోని 145 కేంద్రాల్లో పరీక్షలు జరగగా 28,637 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 28,532 మంది హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షకు 575 మంది విద్యార్థులకు గాను 85 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.

News March 16, 2026

పాతపట్నం: రైలు ఢీకొని 29 ఏళ్ల యువకుడి మృతి

image

పాతపట్నం – తెంబూరు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తు పూరి – గుణుపూర్ రైలు ఢీకొని ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పలాస జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడిది ఒడిశాలోని సింగపూర్ గ్రామస్థుడు భివిషాణ్(29)గా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

News March 16, 2026

శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

image

అల్ప పీడన ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. అకాల వర్షాలు కురిస్తే మామిడి, జీడీ మామిడి, అరటి, మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లాలోని రైతులు దిగులు పడుతున్నారు. వర్షాలు, పిడుగులు పడిన సందర్భాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.