News April 6, 2024
కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ను ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
Similar News
News January 20, 2025
23న విద్యార్థులకు పోటీలు: DEO
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘nothing like voting, 1 vote for sure’ అనే అంశంపై ఈనెల 23న వ్యాసరచన, వక్తృత్వ, స్లోగన్ రైటింగ్, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం తెలిపారు. పాత బస్టాండ్ వద్దనున్న ఉర్థూ బాలుర పాఠశాలలో ఉదయం 9.30గంటలకు పోటీలు జరుగుతాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 25న బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.
News January 20, 2025
జెస్సీ రాజ్‌కు కలెక్టర్ అభినందనలు
ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న గుంటూరు జిల్లాకి చెందిన జెస్సీరాజ్‌ను కలెక్టర్ నాగలక్ష్మీ అభినందించారు. సోమవారం కలెక్టరేట్‌లో జెస్సీరాజ్‌ను సన్మానించిన ఆమె, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి గుంటూరు ఖ్యాతిని పెంపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో నరసింహారెడ్డి పాల్గొన్నారు.
News January 20, 2025
గుంటూరు: ANU డిగ్రీ ఫలితాలు విడుదల
నాగార్జున విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్లు దూరవిద్య పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సయీద్ జైన్ లాబ్దిన్ తెలిపారు. ఫలితాలను సోమవారం వైస్ ఛాన్సలర్ గంగాధరరావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, ఫిబ్రవరి 3లోపు రీవాల్యూవేషన్‌కు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.