News November 10, 2024

కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

image

కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న నిందితుడిపై శనివారం కేసు నమోదు చేశామని నరసాపురం పట్టణ సీఐ బీ.యాదగిరి తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నామాలదిన్ని వెంకట రెడ్డి కొన్నేళ్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలు మార్పింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ప్రచారం చేస్తున్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 9, 2024

గోపాలపురంలో రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

image

గోపాలపురం మండలం దొండపూడిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న తల్లీకుమార్తెలు ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో మరో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రగాయలైన వారిని స్థానికులు వైద్యం కోసం రాజమండ్రి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతులు పోలవరం(M) బండార్లగూడెంకు చెందిన కాంతమ్మ(45), గన్నమ్మ(75)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 9, 2024

ప.గో: ’10వ తేది లాస్ట్.. తప్పులుంటే సరి చేసుకోండి’

image

ప.గో జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10 తరగతి, ఇంటర్ విద్యార్థులు తమ వివరాల్లో తప్పులుంటే సరి చేసుకోవాలని డీఈవో నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తప్పులు ఉంటే సంబంధింత పత్రాలతో సరిచేసుకోవాలన్నారు. డిసెంబర్ 10తో గడువు ముగుస్తుందన్నారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఏఐ కోఆర్డినేటర్లు విద్యార్థులకు ఈ విషయం తెలిసేలా సందేశాలు ఇవ్వాలన్నారు.

News December 8, 2024

జీలుగుమిల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం గ్రామ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. జీలుగుమిల్లి మండలం అంకంపాలెంకి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. అటుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.