News November 9, 2024
కూటమి ప్రభుత్వంలో తూ.గో జిల్లా నేతలకు కీలక పదవులు

సీఎం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో లిస్టులో తూ.గో జిల్లా నేతలకు పదవులు వరించాయి. రాజమండ్రికి చెందిన కూడిపూడి సత్తిబాబుకు ఏపీ శెట్టి బలిజ వెల్ఫేల్& డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, స్వామినాయుడు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్, తుమ్మల రామస్వామి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా, బొడ్డు వెంకట రమణ చౌదరి రాజమండ్రి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
Similar News
News December 1, 2025
2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

తూ.గో జిల్లాలో 2 లక్షల 10వేల 210 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ప్రకటించారు. ఈ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి 42,822 కూపన్లను జనరేట్ చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 11,767 మంది రైతులకు రూ.2,0246 కోట్లను చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు.
News December 1, 2025
తూ.గో: చేతబడి చేశారన్న అనుమానంతో దారుణ హత్య

కోరుకొండ (M) దోసకాయలపల్లిలో ఆనంద్ కుమార్ (30) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆనంద్ తనకు చేతబడి చేశాడని రాజ్‌కుమార్ అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆనంద్ భార్య త్రివేణికి రాజ్ కుమార్ సమీపబంధువు. అతను కొన్నాళ్లు ఆనంద్ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో భార్య పట్ల రాజ్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని బయటికి పంపించారు. కక్ష పెట్టుకున్న రాజ్‌కుమార్ హత్య చేశాడని CI సత్య కిషోర్ వివరించారు.
News December 1, 2025
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.


