News November 9, 2024
కూటమి ప్రభుత్వంలో ప.గో జిల్లా నేతలకు కీలక పదవులు

సీఎం చంద్రబాబు విడుదల చేసిన నామినేటెడ్ పదవుల రెండో లిస్టులో ప.గో జిల్లా నేతలకు కీలక పదవులు వరించాయి. నర్సాపురానికి చెందిన మహమ్మద్ హరీఫ్కి అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ క్యాబినెట్ ర్యాంక్ ఛైర్మన్, భీమవరానికి చెందిన వి.సూర్యనారాయణ రాజు ఏపీ క్షత్రియ వెల్ఫేర్ & డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. కొత్తపల్లి సుబ్బరాయుడికి ఏపీ కాపు వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఛాన్స్ ఇచ్చారు.
Similar News
News December 3, 2025
ధాన్యం రక్షణకు బరకాలు వినియోగించుకోవాలి: జేసీ

సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలలో రైతులకు బరకాలు అందుబాటులో ఉన్నాయని జేసీ రాహుల్ మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 11 వేల బరకాలు ఉన్నాయన్నారు. వీటిని రైతులు వినియోగించుకున్నందుకు ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కళ్లాల్లో ఉన్న రైతులు తమ ధాన్యం తడవకుండా వెంటనే బరకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ సూచించారు.

News December 2, 2025
ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా భీమవరం: కలెక్టర్ నాగరాణి

జిల్లా కేంద్రం భీమవరంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ నయీం అస్మితో కలిసి ట్రాఫిక్ అవరోధాలు, రోడ్డు ఆక్రమణ, సక్రమ పార్కింగ్, భద్రత లేని డ్రైవింగ్ తదితర అంశాలపై చర్చించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.