News March 9, 2025
కూటమి విద్యార్థులను మోసం చేసింది: అవినాశ్

ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వైసిపి శ్రేణులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థులను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అబద్దాలు చెప్పి విద్యార్థులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
Similar News
News March 10, 2025
భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.
News March 10, 2025
గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: పెమ్మసాని

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రకటించారు. PPP మోడల్లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు బస్టాండ్ను పరిశీలించి, స్థల సేకరణ, ఎలక్ట్రికల్ వాహనాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
News March 10, 2025
నల్గొండ: శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఇదే తొలిసారి!

తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఏర్పడ్డ ఎమ్మెల్సీ స్థానాల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీపీఐ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించింది. అందులో భాగంగా సీపీఐ నుంచి నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెంకు చెందిన యాదవ సామాజికవర్గం నెల్లికంటి సత్యం పేరును ప్రకటించింది.