News January 30, 2025
కూడవెళ్లి వాగులో పడి మృతి.. మృతుడు దుబ్బాక వాసి

అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కూడవెళ్లి వాగులో మునిగి ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. మాఘ మాస సందర్భంగా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన బిట్ల శివరాములు(50) కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులోకి దిగిన ఆయన ప్రమాదశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. ఘటన స్థలాన్ని సిద్దిపేట ఏసీపీ మధు, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు హరీష్, గంగరాజు పరిశీలించారు.
Similar News
News February 13, 2025
పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు

AP: తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని CM చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు, RTCలకు కేటాయించేవారు. వీటిని బ్లాక్లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో TTD రద్దు చేసింది. ఇప్పుడు పూర్తిగా AP పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది.
News February 13, 2025
వికారాబాద్: మరోసారి కనిపించిన చిరుత (UPDATE)

వికారాబాద్ అనంతగిరి అడవుల్లో కనిపించిన చిరుత మదనపల్లి బీరోల్ గ్రామ సరిహద్దుల్లో మరోసారి కంటపడింది. బీరోల్ గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ అటుగా వెళుతుండగా చిరుత రోడ్డు దాటుతూ కనిపించిందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత జాడ కోసం సెక్షన్ ఆఫీసర్ అరుణ అన్వేషిస్తున్నారు.
News February 13, 2025
19న BRS విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని KCR ఆదేశం

19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కేసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్౨ను ఆదేశించారు. సమావేశానికి కావలసిన ఏర్పాట్లను హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయాలని కెసిఆర్ సూచించారు.19న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు.