News June 10, 2024

కూడేరులో చోరీ జరిగిన ఏటీఎమ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

image

కూడేరులోని ఏటీఎమ్ సెంటర్లో జరిగిన చోరీపై అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి సీరియస్‌గా స్పందించారు. సోమవారం రాత్రి ఆమె చోరీ జరిగిన ఏటీఎమ్ సెంటర్ ను పరిశీలించారు. ఇప్పటివరకు ఎక్కడా జరగని రీతిలో గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి అందులోని 18 లక్షల పైగా నగదు చోరీ చేయడంపై లోతైన విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఆమె ప్రత్యక్షంగా పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Similar News

News November 20, 2025

అమృత్ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

అమృత్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పబ్లిక్ హెల్త్ పరిధిలో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను వేగవంతం చేయాలన్నారు. గుత్తి, గుంతకల్లులో జరుగుతున్న పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు.

News November 20, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

image

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.