News June 10, 2024
కూడేరులో చోరీ జరిగిన ఏటీఎమ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

కూడేరులోని ఏటీఎమ్ సెంటర్లో జరిగిన చోరీపై అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి సీరియస్‌గా స్పందించారు. సోమవారం రాత్రి ఆమె చోరీ జరిగిన ఏటీఎమ్ సెంటర్ ను పరిశీలించారు. ఇప్పటివరకు ఎక్కడా జరగని రీతిలో గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి అందులోని 18 లక్షల పైగా నగదు చోరీ చేయడంపై లోతైన విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఆమె ప్రత్యక్షంగా పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Similar News
News March 23, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

గుంతకల్లు ఈద్గా మైదానంలో ఉపవాస దీక్షాపరులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ముందుగా మసీదులో సామూహిక ప్రార్థనలో నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షాపరులకు ఫలహారాలు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఉపవాస దీక్షపరుల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే, ఎంపీ ప్రారంభించారు.
News March 23, 2025
కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.
News March 23, 2025
గుత్తిలో కేజీ చికెన్ రూ.170

అనంతపురం జిల్లా గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170-180లుగా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150లతో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700-750లుగా ఉంది.