News January 6, 2025
కూడేరు: రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపిన దున్నపోతు

కూడేరు మండలంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. అమ్మవారికి విడిచిన దున్నపోతు తమదంటే తమదని కడదరకుండ, ముద్దలాపురం గ్రామ ప్రజలు వాదనలకు దిగారు. అయితే ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఇరు గ్రామాల వారు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
Similar News
News November 20, 2025
‘బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి: కలెక్టర్

బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ‘జీవ వైద్య వ్యర్థ పదార్థాల నుంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే గోడ పత్రికలను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ క్లినిక్ సెంటర్లలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు.
News November 20, 2025
అమృత్ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

అమృత్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పబ్లిక్ హెల్త్ పరిధిలో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను వేగవంతం చేయాలన్నారు. గుత్తి, గుంతకల్లులో జరుగుతున్న పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు.
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.


