News December 15, 2024
కూతూరుని వేధిస్తూ తండ్రిని హత్య చేసిన ఉన్మాది
ఏలూరులో దారుణ ఘటన జరిగింది. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని గొడవ పడుతూ వెంకట రాజు (44) అనే వ్యక్తిని నాని అనే యువకుడు శనివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు కాగా పెద్ద కుమార్తెను నాని తరచూ వేధించేవాడన్నారు. దీంతో వెంకటరాజు పిల్లల్ని తీసుకుని ఉంగుటూరుకి వెళ్లి ఉంటున్నారు. పని మీద ఏలూరు వచ్చిన వెంకటరాజుతో నాని గొడవపడి హత్య చేశాడు.
Similar News
News January 17, 2025
భీమవరం మావుళ్లమ్మను దర్శించున్న శ్యామలా దేవి
భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారిని ప్రతి సంవత్సరం దర్శించుకుంటానని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు. శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని చీర అందించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేశ్ స్వాగతం పలికి ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలను నిర్వహించి, సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మొగల్తూరులో కృష్ణంరాజు, సూర్యనారాయణరాజు పేరిట షుగర్ వ్యాధి ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు.
News January 17, 2025
ప.గో: బరువెక్కిన గుండెతో పయనం
ప.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.
News January 17, 2025
ఏలూరు: హీటర్ ఆన్ చేసి మరిచిపోయి వ్యక్తి సజీవదహనం
హీటర్ పెట్టి బకెట్ కరిగి కరెంట్ షాక్‌తో వ్యక్తి సజీవదహనమైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. కాకినాడకు చెందిన గంగాధర్ (30) తాత డెత్ సర్టిఫికెట్ కోసం ఏలూరులోని అక్క ఇంటికి వచ్చాడు. మద్యం తాగి నిద్రిస్తుండగా.. అక్క గడియ పెట్టుకుని బయటకు వెళ్లింది. గంగాధర్ లేచి నీళ్లు పెట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ఎక్కువ సేపు ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని 1 టౌన్ CI సత్యనారాయణ పరిశీలించినట్లు తెలిపారు.