News May 20, 2024
కూనవరం: ఊరేగింపులకు నో పర్మిషన్

ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవాలు జరపరాదని కూనవరం SI శ్రీనివాస్ సూచించారు. స్థానిక పోలీస్టేషన్లో సోమవారం పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయోద్దని, పెట్రోల్, డీజిల్ బాటిల్స్ అమ్మకాలు నిషేధం అన్నారు.
Similar News
News December 4, 2025
కలెక్టరేట్లో ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యిందని, విగ్రహ ప్రతిష్టాపన పనులు చివరి దశకు చేరాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్‌కు మరింత ఆకర్షణ వచ్చే విధంగా విగ్రహ ఏర్పాటు ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 4, 2025
ఖమ్మం: తొలి విడత ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల ఫైనల్ లిస్టును గురువారం మండలాల వారీగా జిల్లా అధికారులు విడుదల చేశారు. ఏడు మండలాల్లో కలిపి 192 సర్పంచి స్థానాలకు 476, 1,740 వార్డుల స్థానాలకు 3,275 మంది పోటీ పడుతున్నారు. కొణిజర్ల S-73 W-524, రఘునాథపాలెం S-106 W-589, వైరా S-50 W-348, బోనకల్ S-46 W-414, చింతకాని S-64 W-466, మధిర S-67 W-468, ఎర్రుపాలెం S-70 W-466 ఖరారయ్యారు.
News December 4, 2025
ఖమ్మం: ఏపీ సీఎం సతీమణి వాహానం తనీఖీ

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం చెక్ పోస్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని తనీఖీ చేశారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఆమె వాహనాన్ని తనీఖీ చేశారు. ఆమె వెళ్తున్న వివరాలను అధికారులు నోట్ చేసుకున్నారు.


