News May 4, 2024
కూరగాయలు, పండ్లు అమ్మిన కడియం కావ్య

కాజీపేట, రహమాత్నగర్ చౌరస్తాలో శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా.కడియం కావ్య ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను, రైతులను కలిశారు. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వారిని కోరారు. అనంతరం మార్కెట్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్మారు.
Similar News
News December 9, 2025
ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులను ఆమె ఆదేశించారు.
News December 8, 2025
వరంగల్: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

జీ.పీఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మొదటి విడత 3వ, రెండవ విడత 2వ ర్యాండమైజేషన్ను జిల్లా సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, కలెక్టర్ డా.సత్య శారద సమక్షంలో పూర్తిచేశారు. రెండు విడతల్లో కలిపి 4,543 మంది పి.ఓ., ఓ.పీ.ఓలను పారదర్శకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.
News December 8, 2025
పోలింగ్ రోజున వరంగల్లో స్థానిక సెలవులు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించినట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులందరికీ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.


