News March 21, 2024

కూర్మన్నపాలెం: బాలికను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

image

బాలికను ప్రేమ పేరిట వేధిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. దువ్వాడ సెక్టర్-1లో ఉంటున్న డి. మణికంఠ(33) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. తొమ్మిదో తరగతి బాలిక పాఠశాలకు రాకపోకలు సాగించే సమయంలో, మణికంఠ ఆమె వెంట పడి, ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. విసిగిపోయిన బాలిక వేధింపుల విషయాన్ని ఇంట్లో చెప్పడంతో, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News October 6, 2024

ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానం: కలెక్టర్

image

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. వార్డు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. గత నెల 29 నుంచి ఇప్పటివరకు 442 మంది ఇసుక బుకింగ్ చేసుకోగా 357మందికి ఏడు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశామన్నారు. ప్రజలే ఇసుకను రవాణా చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించామన్నారు.

News October 6, 2024

విశాఖ డెయిరీ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి: జనసేన కార్పొరేటర్

image

విశాఖ డెయిరీ అవినీతి బాగోతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం మాట్లాడారు. ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీకి మూడు లక్షల మంది పాడి రైతులు దశాబ్దాలుగా పాలు పోస్తూన్నారని, రూ.200 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ డెయిరీ చరిత్రలో ఇప్పుడు నష్టాల బాటలో ఉన్నా ఆడారి కుటుంబం మాత్రం లబ్ది పొందిందన్నారు. డెయిరీ ఆస్తులపై CBI విచారణ చేయాలన్నారు.

News October 6, 2024

విశాఖ: ఉక్కు పోరాట కమిటీతో నేడు పవన్ కళ్యాణ్ భేటీ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆదివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ యువ కార్మికులు శనివారం మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ జనసేన నాయకులను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో తమను కలిసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లు కమిటీ నాయకులు తెలిపారు.