News March 21, 2024
కూర్మన్నపాలెం: బాలికను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

బాలికను ప్రేమ పేరిట వేధిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. దువ్వాడ సెక్టర్-1లో ఉంటున్న డి. మణికంఠ(33) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. తొమ్మిదో తరగతి బాలిక పాఠశాలకు రాకపోకలు సాగించే సమయంలో, మణికంఠ ఆమె వెంట పడి, ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. విసిగిపోయిన బాలిక వేధింపుల విషయాన్ని ఇంట్లో చెప్పడంతో, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News February 15, 2025
విశాఖలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శనివారం గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు, పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News February 15, 2025
పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం: కలెక్టర్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆహ్లాదకర వాతావరణంలో పని చేద్దామని స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిబ్రవరి నెల 3వ శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఇతర సంస్థల పరిధిలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నాట్లు ఆయన తెలిపారు.
News February 15, 2025
విశాఖలో జీబీఎస్ కలకలం.. ఐదు కేసులు నమోదు

విశాఖలో గులియన్ బారే సిండ్రోం (జీబీఎస్) కేసులు నమోదు కావడం కలకలం రేపింది. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు ఈ సమస్యతో కేజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలోని ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో వీరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తిగా కోలుకునేవరకు తమ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.