News January 1, 2025
కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీరామచంద్రుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు స్వామివారిని కూర్మావతారంలో అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి నిత్యకళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో ఈవో రమాదేవి పాల్గొన్నారు.
Similar News
News January 17, 2025
ఖమ్మం: వైరా సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు
ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంపై విమర్శలు వచ్చాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. ఎల్‌ఆర్‌ఎస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం, 10 పాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.
News January 17, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్న రేషన్ కార్డుల సర్వే
News January 16, 2025
కనులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.