News September 1, 2024
కూలర్ రిపేర్ చేస్తుండగా షాక్.. వ్యక్తి మృతి

రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని పల్లూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఆవుల రామారావు రిపేర్‌కు వచ్చిన ఓ కూలర్ మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. ఆపస్మారక స్థితికి చేరుకొన్న అతడిని కోతులగుట్టలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరణించాడు. రామారావుకు ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2026
లెక్క తేల్చేందుకు కసరత్తు.. ముహూర్తం ఫిక్స్!

తూ.గో జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ గురువారం తెలిపారు. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ శిక్షణ జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
News February 26, 2026
CM మాట ఇచ్చారు.. అధికారులు పని మొదలెట్టారు!

తాళ్లపూడి మండలం మలకపల్లి ప్రజావేదికలో సనమండ్ర పోసియ్యకు ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాలతో హౌసింగ్ అధికారులు, MRO గురువారం లబ్ధిదారుడి అసంపూర్తి గృహాన్ని పరిశీలించారు. హౌసింగ్ విభాగం నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. CM ఆదేశాలతో పనులు వేగవంతం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 26, 2026
ఫిబ్రవరి 28న బిక్కవోలు జాబ్ మేళా

బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి 19-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.


