News September 1, 2024

కూలర్ రిపేర్ చేస్తుండగా షాక్.. వ్యక్తి మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని పల్లూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఆవుల రామారావు రిపేర్‌కు వచ్చిన ఓ కూలర్ మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. ఆపస్మారక స్థితికి చేరుకొన్న అతడిని కోతులగుట్టలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే మరణించాడు. రామారావుకు ఇంకా వివాహం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 11, 2024

కోనసీమ: 9 ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

image

రాజోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలికపై సత్యనారాయణ (72) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక సోదరి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదుచేసినట్లు రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 7న బాలిక ఆడుకుంటుండగా నిందితుడు చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియవేసి అత్యాచారానికి ప్రయత్నించాడన్నారు. పిల్లలు తలుపు కొట్టడంతో పారిపోయాడన్నారు.

News September 11, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నేడు పర్యటన

image

ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం (నేడు) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ మంగళవారం రాత్రి ఆర్డీవో సీతారామారావుతో కలిసి పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సామర్లకోటలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గంలో 2.40 గంటలకు కిర్లంపూడి మండలం రాజుపాలెం చేరుకొని నీటమునిగిన గ్రామాలు, పంటలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు.

News September 10, 2024

కాకినాడ: ఈ మండలాల్లో రేపు స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పలు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారి రమేష్ తెలిపారు. కలెక్టర్ షాన్ మోహన్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు గమనించాలన్నారు.