News April 11, 2025

కూలీలకు 100రోజుల పని కల్పించాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కాగజ్‌నగర్ మండలం కోయవాగులో ఉపాధి హామీ పథకం క్రింద జరుగుతున్న అభివృద్ధి ఫారం పాండ్ పనులను పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కొనసాగుతున్న పనులలో ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించాలని తెలిపారు.

Similar News

News April 19, 2026

ADB: డైరెక్ట్ వాట్సాప్‌కే హాల్ టికెట్

image

ఆదిలాబాద్‌లో ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హాల్‌టికెట్లను ఈసారి సులభంగా వాట్సాప్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు 8096958096 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని, ‘HI’ అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవను పొందవచ్చు. అక్కడ కనిపించే ఆప్షన్లలో పదో తరగతి లేదా ఇంటర్ థియరీని ఎంచుకొని, అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేస్తే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.

News April 19, 2026

దామరగిద్ద: కానుకుర్తి రిజర్వాయర్‌కు భూమి పూజ

image

మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం దామరగిద్ద సమీపంలోని కానుకుర్తి రిజర్వాయర్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం కానుకుర్తి గ్రామ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం అభినందనీయమని, వారి త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

News April 19, 2026

అచ్చంపేట: వడదెబ్బతో ఒకరి మృతి

image

అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఎండల తీవ్రతకు ఒకరు బలయ్యారు. గ్రామానికి చెందిన బాలయ్య (35) వడదెబ్బకు గురై ఆదివారం ఉదయం మృతి చెందాడు. మద్యపానానికి అలవాటు ఉన్న బాలయ్య, తీవ్ర ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలు వదిలినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అధికారులు స్పందించి బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.