News February 22, 2025
కూలేందుకు సిద్ధంగా అల్లూరి విగ్రహం

చింతపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద అల్లూరి విగ్రహం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అల్లూరి విగ్రహం కింద ఉన్న పీఠం పూర్తిగా ధ్వంసమైంది. ఓ వైపు ఒరిగిపోయి కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పీఠం మరమ్మతులు చేపట్టాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
Similar News
News December 9, 2025
ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా పంచాయతీ పోరు!

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంతగా ఈసారి సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. BRS, INC, BJP అభ్యర్థులకు దీటుగా రెబల్స్ బరిలోకి దిగడంతో గ్రామాల్లో ప్రచారం ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇవి ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని ఓటర్లు అంటున్నారు. ఎల్లుండే తొలి విడత పోలింగ్ జరగనుండటంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్ పోటీదారులు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు.
News December 9, 2025
ప్రకాశం: టెట్ పరీక్ష రాస్తున్నారా.. ఈ రూల్స్ పాటించండి.!

ప్రకాశం జిల్లాలో రేపటి నుంచి జరిగే టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకై కలెక్టర్ రాజాబాబు పలు సూచనలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, పరీక్ష హాలులోకి సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరాలని సూచించారు. ఉదయం 510 మంది, సాయంత్రం 300 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
News December 9, 2025
తిరుమలలో తులాభారం గురించి తెలుసా?

తిరుమల కొండపై శ్రీవారి మొక్కుబడులలో తలనీలాల తర్వాత అంతే ముఖ్యమైనది ‘తులాభారం’. ఇది భక్తులు తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం, తమ కోరికలు తీరినందుకు తీర్చుకునే మొక్కుగా భావిస్తారు. బిడ్డ బరువెంతుందో అంతే మొత్తంలో చిల్లర నాణాలు, బెల్లం, చక్కెర, కలకండ, బియ్యంతో తూకం వేసి, ఆ మొత్తాన్ని స్వామివారి హుండీకి సమర్పిస్తారు. ఈ మొక్కును ఆలయ మహద్వారం వద్ద రుసుము చెల్లించి తీర్చుకోవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


