News February 13, 2025
కూసుమంచి: కల్లులో పురుగు మందు కలిపాడు..!

కల్లు అమ్మకంలో వచ్చిన విభేదాలతో ఓ గీత కార్మికుడు మరోగీత కార్మికుడి కల్లుకుండలో పురుగు మందు కలిపిన ఘటన కూసుమంచి మండలంలో వెలుగు చూసింది. మొక్క వీరబాబుకు ఐతగాని రమేష్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న రమేష్, వీరబాబుకి చెందిన కల్లు కుండలో విషం కలిపాడు. చెట్టు ఎక్కగా వాసన రావడంతో అనుమానం వచ్చిన వీరబాబు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించగా రమేష్ అంగీకరించడంతో కేసు నమోదు చేశారు.
Similar News
News November 23, 2025
KMM: డీసీసీ అధ్యక్షుల్లో మంత్రుల అనుచరులకు కీలక స్థానం

ఖమ్మం డీసీసీ అధ్యక్షుల నియామకంలో ముగ్గురు మంత్రుల అనుచరులకు పదవులు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం భట్టి వర్గానికి చెందిన నూతి సత్యనారాయణ, ఖమ్మం టౌన్ అధ్యక్షుడిగా తుమ్మల వర్గం నుంచి నాగండ్ల దీపక్ చౌదరి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా మంత్రి పొంగులేటి వర్గానికి చెందిన తోటదేవి ప్రసన్న ఖరారయ్యారు. ఈ నియామకాలతో సామాజిక న్యాయం కూడా జరిగిందనే చర్చ జరుగుతోంది.
News November 23, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఎదులాపురంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
∆} సత్తుపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.
News November 23, 2025
ఖమ్మం: రిజర్వేషన్లు కొలిక్కి.. నేడు గెజిట్ విడుదల?

ఖమ్మం జిల్లాలోని 571 గ్రామ పంచాయతీలు, 5214 వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఏజెన్సీలో 99 ఎస్టీ పంచాయతీలు ఉండగా, మైదాన ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 49 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ కసరత్తు పూర్తవడంతో నేడు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నవంబర్ 25 లేదా 26 నాటికి రాష్ట్ర నోటిఫికేషన్ వెలువడనుంది.


