News February 13, 2025
కూసుమంచి: కల్లులో పురుగు మందు కలిపాడు..!

కల్లు అమ్మకంలో వచ్చిన విభేదాలతో ఓ గీత కార్మికుడు మరోగీత కార్మికుడి కల్లుకుండలో పురుగు మందు కలిపిన ఘటన కూసుమంచి మండలంలో వెలుగు చూసింది. మొక్క వీరబాబుకు ఐతగాని రమేష్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న రమేష్, వీరబాబుకి చెందిన కల్లు కుండలో విషం కలిపాడు. చెట్టు ఎక్కగా వాసన రావడంతో అనుమానం వచ్చిన వీరబాబు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించగా రమేష్ అంగీకరించడంతో కేసు నమోదు చేశారు.
Similar News
News March 25, 2025
‘రైతులకు సాగు లాభాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలి’

రైతులకు సాగు లాభాలు పెంచడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, వైరా కృషి విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించిన మధ్య తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మంది రైతులు వరిపై ఆధారపడడం మంచిది కాదని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
News March 24, 2025
‘రాజీవ్ యువ వికాసం పథకాన్ని స్వదినియోగం చేసుకోండి’

ఏప్రిల్ 5లోపు రాజీవ్ యువ వికాసం పథకానికి బీసీ, ఈబీసీ, EWS నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జ్యోతి తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిందని, దీనిని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.
News March 24, 2025
విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది..

ఓ విద్యార్థిని తండ్రి పట్టుదల కారణంగా ఓ స్కూల్ మూతపడకుండా నడుస్తోంది. వైరా మం. నారపునేనిపల్లి స్కూల్‌లో కోతుల బెడద, ఇతర కారణాలతో విద్యార్థులు వెళ్లిపోయారు. దీంతో స్కూల్ మొత్తంలో నాలుగో తరగతి విద్యార్థి కీర్తన మాత్రమే మిగిలింది. అధికారులు స్కూల్‌ను మూసివేసేందుకు యత్నించగా.. తన కుమార్తె చదువు మాన్పిస్తానని కీర్తన తండ్రి అనిల్‌శర్మ చెప్పారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలనడంతో వెనక్కి తగ్గారు.