News September 19, 2024
కూసుమంచి: పాలేరు పాత కాల్వకు సాగర్ నీరు విడుదల
పాలేరు ఎడమ కాలువ మరమ్మతులను ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వెంటనే ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. పాత కాల్వ పరిధిలోని 25వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News October 3, 2024
కొత్తగూడెం: ధ్రువపత్రాల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
డీఎస్సీ-2024 అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాలలో డీఎస్సీ 2024 కు 1:3 నిష్పత్తిలో ఎన్నికైన అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన సరళిని కలెక్టర్ పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్న తక్షణమే నివృత్తి చేస్తూ సానుకూల వాతావరణంలో పరిశీలన పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
News October 3, 2024
గ్రామాల్లో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న పూల పండుగ(బతుకమ్మ) సంబురాలు రానే వచ్చాయి. దీంతో గ్రామాలు సందడిగా మారాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించుకునే బతుకమ్మ సంబరాల్లో భాగంగా తీరొక్క పూలతో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పేర్చి రోజుకో నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మ సంబరాలు దుమ్ముగూడెం మండలంలో మొదటిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో అట్టహాసంగా ముగుస్తాయి.
News October 3, 2024
కొత్తగూడెం: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లపల్లి మండలం లక్ష్మిపురానికి చెందిన ప్రవీణ్, ప్రణయ్ కలిసి బుధవారం బైక్‌పై అనంతొగుకి వెళ్లారు. మర్కోడు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.