News January 14, 2025
కూసుమంచి: రైతులు విన్నవించారు.. మంత్రి స్పందించారు

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూసుమంచి మండలం చౌటపల్లి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన పైపులు దెబ్బతినడంతో నీటి సరఫరా ఆగిపోయింది. ఈసందర్భంగా రైతులు స్థానిక నాయకుల ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలతో అధికారులు సమస్యను పరిష్కరించారు. నేడు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 7, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News February 7, 2025
కొణిజర్ల: కాల్వలో ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన గురువారం కొణిజర్ల మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..పెద్దగోపతికి చెందిన తడికమళ్ల రవి తన మిత్రులతో కలిసి మొక్కజొన్న పంటకు నీరు కట్టేందుకు ట్రాక్టర్‌పై జనరేటర్ తీసుకుని బయలుదేరాడు. రాపల్లె మేజర్ కాల్వ మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కాల్వలో పడింది. రవిపై ఇంజిన్ తిరగబడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News February 7, 2025
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళన చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. మండాలపాడుకి చెందిన గోపీచంద్ తాను 7ఏళ్లుగా ప్రేమించుకున్నామని.. కొద్ది రోజుల క్రితం తనకు వేరే వ్యక్తి వివాహమైందని బాధితురాలు తెలిపింది. భర్తను వదిలేసి తన వద్దకు రావాలని గోపిచంద్ వేధించడంతో భర్తకు విడాకులు ఇచ్చానట్లు వెల్లడించింది. తీరా వచ్చిన తరువాత గోపిచంద్ ముఖం చాటేస్తున్నాడని అవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టింది