News January 30, 2025

‘కృత్రిమమేథను అందిపుచ్చుకోవాలి’

image

అధునాతన పరిజ్ఞానాలు కృత్రిమమేథ(ఏఐ), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ)ను భారతీయులు సైతం అందిపుచ్చుకోవాలని బ్రిటన్, ఫెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని డిజిటల్ మీడియా అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్ అభిప్రాయపడ్డారు. అత్యంత ఖర్చు, వ్యయంతో కూడినదైనా దాన్ని వదులుకోకూడదన్నారు. ‘తెలంగాణలో కృత్రిమ మేథ విధానాలు, మౌలిక సదుపాయాలు, అభ్యాసాలు: ప్రారంభ ముద్రలు’ అనే అంశంపై గీతం వర్సిటీలో వారు ప్రసంగించారు.

Similar News

News February 19, 2025

జిల్లా కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

image

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, సాగునీరు, రైతు భరోసా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు పాల్గొన్నారు. జిల్లాలోని 75 ప్రభుత్వ సంక్షేమ శాఖల గురుకులాలు, వసతి గృహాలలో వినూత్నంగా విద్యార్థులకు డార్మిటరీలు ఫిర్యాదుల పెట్టే తీసుకొచ్చి చలికాలంలో వేడి నీరు అందించడం పై చర్చించారు.

News February 18, 2025

కరీంనగర్: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికీ 11 ఏళ్లు..

image

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికీ 11 ఏళ్లు అయింది. 2014 ఫిబ్రవరి 18 ఇదే రోజున లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదించిన రోజు అని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ గుర్తుచేశారు. కేసీఆర్‌ లాంటి దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజాఉద్యమంలో విజయం సాధించిన రోజు అని కొనియాడారు. పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్‌ నిరూపించిన రోజు అని తెలిపారు.

News February 18, 2025

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.పురుషోత్తం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన కందులను వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించి రూ.7,550 మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ సిబ్బంది, DCMS సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

error: Content is protected !!